ఇది తమిళ చిత్రం మండేలాకు తెలుగు అనుకరణ చేసిన మార్టిన్ లూథర్ కింగ్ 27-10-2023 లో విడుదలైన తెలుగు భాషా రాజకీయ వ్యంగ్య చిత్రం, పూజ కొల్లూరు ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం. దీనిని YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ మరియు మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దివంగత అమెరికన్ బాప్టిస్ట్ మంత్రి మార్టిన్ లూథర్ కింగ్ పేరు మీదుగా రూపొందిన ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించగా, నరేష్, శరణ్య ప్రదీప్ మరియు వెంకటేష్ మహా సహాయక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం స్మరణ్ సాయి అందించారు మరియు ఛాయాగ్రహణం దీపక్ యరగెర నిర్వహించారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు పూజ కొల్లూరు ఎడిటింగ్‌ను నిర్వహించారు.
కథ: ఆంధ్రా ప్రాంతంలోని పడమరపాడు అనే ఒక ఊరిలో రెండు కులాలకు వైరం నడుస్తుంటుంది. ఈ రెండు కులాల మధ్య ఘర్షణను ఆపాలని ఆ కులాల్లోంచి ఇద్దరు అమ్మాయిలను పెళ్లాడతాడు ఓ పెద్ద మనిషి. కానీ ఆ ఇద్దరు పెళ్లాలకు పుట్టిన జగ్గు లోకి పుణ్యమా అని ఆ ఊర్లో కులాల గొడవలు ఇంకా పెరుగుతాయి. అభివృద్ధికి నోచుకోకుండా తిరోగమనంలో పయనిస్తున్న ఈ ఊరిలో కొత్తగా ఎన్నికలు వస్తాయి. చాలా ఏళ్ల నుంచి ప్రెసిడెంటుగా ఉన్న తమ తండ్రి అనారోగ్యం బారిన పడటంతో జగ్గు ఎన్నికల బరిలోకి దిగుతారు. ఐతే ఊర్లోని రెండు కులాలకు చెందిన ఓట్లు సమానంగా ఉండటంతో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి . ఆ సమయంలోనే ఊరిలో కొత్తగా ఓటు సంపాదించిన మార్టిన్ లూథర్ కింగ్ కీలకం అవుతాడు. ఇంతకీ ఈ కింగ్ ఎవరు.. తన నేపథ్యమేంటి.. తన పేరు వెనుక కథేంటి.. అతను ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసి గెలిపించాడు అనేది ఈ చిత్రంలో సారాంశం..