వ్రాసిన వారు,దర్శకత్వం వహించినది: అనిల్ రావిపూడి
ద్వారా ఉత్పత్తి చేయబడింది: సాహు గారపాటి
హరీష్ పెద్ది
నటించారు: నందమూరి బాలకృష్ణ,కాజల్ అగర్వాల్,శ్రీలీలా,అర్జున్ రాంపాల్
ఛాయాగ్రహణం: రామ్ ప్రసాద్
కూర్పు: తమ్మిరాజు
సంగీతం: ఎస్.ఎస్. థమన్
నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్
విడుదల తేదీ: 2023 అక్టోబరు 19
దేశం: భారతదేశం
భాష: తెలుగు.
కథ : నేలకొండ భగవంత్ కేసరి చేయని నేరాని జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. ఆ జైలులో ఓ వ్యక్తిని కొంత మంది నేరస్తులుగా ప్రవేశించిన దుండుగలు అతన్ని హత్యయత్నానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో భగవంత్ కేసరి అతన్ని కాపాడుతాడు. ఆ తర్వాత జైలర్ అతనెవరో తెలుసుకుంటాడు. ఈ క్రమంలో జైలర్ బిడ్డ విజయ లక్ష్మి అలియాస్ విజ్జి కు ఆత్మబంధువు అవుతాడు. ఈ క్రమంలో జైలర్ అనుకోనుకోండా యాక్సిండెంట్ గురై చనిపోతాడు. తర్వాత జైలర్ కూతురు బాధ్యతలను కన్న తండ్రిలా స్వీకరిస్తాడు భగవంత్ కేసరి. ఈ క్రమంలో భగవంత్ కేసరి కూతురును ఆ రాష్ట్రంలోనే బిగ్ షాట్ అయిన రాహుల్ సంఘ్వి చంపాలనే ప్రయత్నం చేస్తాడు. అతను విజ్జి చంపాలనుకునే క్రమంలో భగవంత్ కేసరికి అర్జున్ రాంపాల్‌కు ఉన్న పాత వైరం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో రాహుల్ సంఘ్వీ బారి నుంచి తన బిడ్డ విజ్జిని భగవంత్ కేసరి ఎలా కాపాడుకున్నాడు. ఈ క్రమంలో చనిపోయిన జైలర్‌కు ఇచ్చిన మాట ప్రకారం కూతురును ఆర్మీ ఆఫీసర్‌గా చేసాడా లేదా అనేదే భగవంత్ కేసరి స్టోరీ.