జింతాక్ జిత జిత చేసిన టైగర్ నాగేశ్వరరావు...
70వ దశకంలో ఆంధ్రా ప్రాంతాన్ని గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. టైగర్ నాగేశ్వరరావు. మాస్ రాజా రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల రూపొందించిన ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దసరా కానుగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యింది.
కథ: దొంగతనాలకు ప్రసిద్ధి చెందిన స్టువర్టుపురంలో ఎనిమిదేళ్ల వయసులోనే ఒక దొంగతనం చేసే క్రమంలో తండ్రినే చంపిన నాగేశ్వరరావు.. యుక్త వయసు వచ్చేసరికి గజదొంగగా మారతాడు. భారీ దొంగతనాలతో తమకు సవాలుగా మారిన నాగేశ్వరరావును పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించవు. చివరికి ఒక భారీ దొంగతనం కేసులో పోలీసులు అతణ్ని మద్రాస్ జైల్లో పెడితే.. అక్కడ్నుంచి కూడా తప్పించుకుంటాడు. టైగర్ నాగేశ్వరరావు గురించి ఒక దశలో ప్రధానమంత్రి భద్రతాధికారి సైతం కంగారు పడే పరిస్థితి వస్తుంది. అతను నాగేశ్వరరావు గురించి తెలుసుకోవడానికి స్టువర్టుపురం వస్తాడు. అక్కడ నాగేశ్వరరావులో తెలియని కోణాలన్నీ బయటపడతాయి. ఆ కోణాలేంటి.. అసలు నాగేశ్వరరావు ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు.. దోచుకున్న డబ్బంతా ఏం చేస్తున్నాడు... వెండితరమై వీక్షించాల్సిందే...