తారాగణం: రాఘవ లారెన్స్ - SJ సూర్య - నవీన్ చంద్ర - నిమిషా సజయన్ - షైన్ టామ్ చాకో - ఇళవరసు మరియు ఇతరులు సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: తిరు నిర్మాత: కార్తికేయ సంతానం - కదిరేశన్ రచయిత/దర్శకుడు: కార్తీక్ సుబ్బరాజ్
విడుదల: 2023-11-10
కథ
రే డాసన్ పోలీసు SI. తను చేయని మర్డర్ కేస్ లో తనే ఇన్వాల్వ్ అయ్యాడు. అతనిలాగే మరో ముగ్గురు పోలీసు అధికారులు వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తాను చెప్పిన వ్యక్తులను చంపేస్తే నలుగురిపై పెట్టిన కేసులను ఎత్తివేసి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని డీఎస్పీ సూచిస్తాడు. సీజర్ అనే క్రూరుడిని చంపే లక్ష్యంతో డాసన్ రంగప్రవేశం చేస్తాడు. సీజర్ సినిమా పిచ్చి గురించి తెలుసుకుని, తనను తాను దర్శకుడిగా పరిచయం చేసుకుని అతనిని ఆశ్రయిస్తాడు. సీజర్ రోజువారీ వ్యవహారాలపై సినిమా తీయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. డాసన్ అనుకున్న విధంగా సీజర్ని చంపగలిగాడా లేదా అనేది మిగతా కథ.