జపాన్ చిత్రం లో, కథ మొత్తం కేవలం ఒక దోపిడీ చుట్టూనే తిరుగుతుంది.
విడుదల : 2023-11-10
నటీనటులు: కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్
KS రవికుమార్, విజయ్ మిల్టన్ మరియు ఇతరులు సంగీతం: GV ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ: రవివర్మన్ సాహిత్యం: రాకెందుమూరి నిర్మాత: SR ప్రభు – SR ప్రకాష్ బాబు
రచయిత/దర్శకుడు: రాజు మురుగన్
ఒక దొంగ. చిన్నప్పట్నుంచి అనాథగా పెరిగిన అతను. పెరిగి పెద్ద దొంగగా మారతాడు. ఇండియా మొత్తం భారీ దొంగతనాలు చేస్తూ వివిధ రాష్ట్రాల పోలీసులను తిప్పలు పెడుతుంటాడు. దొంగతనం చేసిన ప్రతి చోటా తన మార్కు చూపించే అతను. తన మీద తనే ఒక సినిమా కూడా తీసుకుని ఒక సినిమా హాల్ లో ఆడిస్తుంటాడు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని కేసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న జపాన్ మీద ఒక మంత్రికి సంబంధించిన నగల దుకాణంలో ఏకంగా ₹200 కోట్ల బంగారాన్ని దోచుకున్నట్లు ఆరోపణలు వస్తాయి. వివిధ రాష్ట్రాల పోలీసులు అతడి వెంట పడతారు. కానీ ఆ దొంగతనం చేసింది జపాన్ కాదు. ఎవరో తెలివిగా అతణ్ని ఈ కేసులో ఇరికించారని తర్వాత తేలుతుంది. ఇంతకీ అసలు దొంగ ఎవరు.. అతణ్ని జపాన్ ఎలా పట్టుకుని తన కథ ముగించాడన్నది మిగతా కథ.