నటీనటులు: దినేష్ తేజ్, హెబా పటేల్, పాయల్ రాధాకృష్ణ, ఝాన్సీ, చమ్మక్ చంద్ర, శత్రు తదితరులు
నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్
దర్శకత్వం: మారేష్ శివన్
సంగీతం: సుభాష్ ఆనంద్
కథ: విశాఖపట్నం లోని వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు గణేష్ కు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా దర్శకుడు కావాలని కల. ఆ దిశగా ప్రయత్నిస్తున్న సమయంలోనే తన గ్రామానికి చెందిన దివ్య తో ప్రేమలో పడతాడు. ఈ విషయం దివ్య తల్లి కనకం దృష్టికి రావడంతో.. కూతుర్ని తన బంధువువైన కాళీ కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. దివ్య పెళ్లి విషయం తెలిసినా.. గణేశ్ అడ్డుకునే ప్రయత్నం చేయడు. తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం హైద్రాబాద్ వెళ్తాడు. సినిమా తీయాలన్న గణేష్ లక్ష్యం నెరవేరిందా? కాళీతో దివ్య పెళ్లి జరిగిందా? లేదా? ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతున్నా.. గణేష్ ఎందుకు ఆపలేకపోయాడు? హైదరాబాద్ లో గణేష్ పడిన కష్టాలేంటి? అతని జీవితంలోకి అను ఎలా వచ్చింది? అను పరిచయంతో గణేశ్ జీవితం ఎలా మారింది? తను ప్రేమించిన అమ్మాయి దివ్య. తనను ఇష్టపడిన అమ్మాయి అను..ఇద్దరిలో ఎవరిని గణేష్ తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు?
'అలా నిన్ను చేరి' కథ సారాంశం.