ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తమ రెండు తొలి మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూశాయి. కంగారూ జట్టు తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో, రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో శ్రీలంక, రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది.
2023 వన్డే ప్రపంచకప్‌లో ఈరోజు ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియం (ఎకనా)లో మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.
ప్రపంచకప్ నుంచి శ్రీలంక కెప్టెన్ షనక ఔట్..
ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. గాయం కారణంగా శ్రీలంక కెప్టెన్ దసున్ షనక ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. అక్టోబర్ 10న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షనక గాయపడ్డాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ చమికా కరుణరత్నే జట్టులోకి వచ్చాడు. నివేదిక ప్రకారం, షనక గైర్హాజరీలో కుశాల్ మెండిస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.