ఈ సృష్టిలో సమాధానాలు లేని, సమాధానాలు అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని అంటుంటారు. అయితే వాటిలో ప్రధానమైన ప్రశ్నల్లో ఒకటి... మరణం తర్వాత ఏమి జరుగుతుంది? అని! ఈ ప్రశ్నకు సమాధానం వివిద మతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. అయితే సైంట్ ఫిక్ గా ఇప్పటివరకూ సమాధానం దొరకలేదు! అయితే నా వద్ద సమాధానం ఉందని అంటున్నాడు ఒక శాత్రవేత్త! మరణం తర్వాత ఏమి జరుగుతుంది? అని అంటే... పూర్వ జన్మ ఉంటుందని ఒక మతం చెబితే.. స్వర్గం - నరకం ఉంటాయని మరొకరు చెబుతుంటారు. అయితే దేవుడి రెండో రాకడ అనంతరం తీర్పు సమయం వరకూ ఆత్మలు మధ్యాకాశంలో ఉంటాయని మరికొందరు చెబుతుంటారు! అయితే యూఎస్ కి చెందిన ఓ శాస్త్రవేత్త మాత్రం... మరణం తర్వాత ఏం జరుగుతుందనే విషయం ఆధారాలతో సహా చెబుతున్నాడు! అవును... మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనే విషయంలో అత్యంత ఉత్సుహక కలిగి ఉన్నారు డాక్టర్ జెఫ్రీ లాంగ్. దీనికోసం ఏకంగా ఇప్పటివరకూ 5 వేల మరణాలపై అధ్యయనం చేశారు. ఇదే క్రమంలో... "నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ఫౌండేషన్"ను స్థాపించాడు. ఈ ప్రయత్నాలతో, పరిశోధనల అనుభవాలతో ఓ వ్యాసాన్ని కూడా రాశాడు.
https://www.tupaki.com/latest-news/istherealifeafterdeath-1312748
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Breaking News